09-05-2025 12:54:51 AM
టైటిల్ కోసం తీవ్ర పోటీ
‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైన్యం పా క్ ఉగ్ర స్థావరాలపై దాడు లు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ సంప్ర దాయంలో వివాహిత మ హిళలకు సిందూరం ము ఖ్యమైంది కాబట్టి.. ఆ సిందూరాన్ని వారికి దూరం చేసిన ఘాతకులపై ఆ పేరుతో ప్రతీకారం తీర్చుకుంది మన దేశం. అయితే ఈ ఆపరేషన్ పేరును తమ సినిమాకు పెట్టుకునేందుకు ఫిల్మ్ మేకర్స్ పోటీపడుతున్నారు.
అది కూడా ఒకట్రెండు కాదు.. దాదాపు 15 నిర్మాణ సంస్థలు ఈ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా యి. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌లో నిర్మాతలు దరఖాస్తు చేసినట్టు బాలీవుడ్ మీడియా లో వార్తలొచ్చాయి.
ఈ టైటిల్ కోసం అర్జీ పెట్టుకున్నవారిలో టీ సిరీస్, జీ స్టూడియోస్ వంటి ప్రముఖ సంస్థలూ ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఇప్పటిదాకా ఈ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్న నిర్మాణ సంస్థల్లో తొలి అర్జీ మాత్రం మహవీర్ జైన్ ఫిల్మ్స్‌దే కావటం గమనార్హం. అయితే ఇదే టాపిక్‌పై సినిమా తెరకెక్కుతుందా? లేదా అన్నది సందేహమేనని దరఖాస్తుదారుల్లో ఒకరైన నిర్మాత అశోక్ పండిత్ వెల్లడించడం విశేషం.