‘ఆపరేషన్ సిందూర్’
నేపథ్యంలో సోషల్ మీడియా అంతా ముక్తకంఠంగా భారత సైన్యానికి జేజేలు పలుకుతోంది. దీనిపై సినీ ప్రముఖులు స్పందించారు. టాలీవుడ్ స్టార్స్ ఆసక్తికరమైన పోస్టులు పెట్టారు. అటు కోలీవుడ్ నుంచీ ఈ స్పందన బాగా ఉంది.
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది.
చిరంజీవి
సాయుధ దళాలు ఒక్కటైన వేళ.. గర్వంగా ఉంది. భారత ప్రభుత్వం తీసుకున్న వూహాత్మక సైనిక చర్యను అభినందిస్తున్నా
కమల్‌హాసన్
పోరాటం ఇప్పుడే ప్రారంభమైంది. లక్ష్యం పూర్తయ్యేవరకూ ఆగదు. దేశం మొత్తం మీతో ఉంది. జైహింద్
రజనీకాంత్
ఎన్నో రోజుల నిశబ్దం తర్వాత ఆపరేషన్ సిందూర్ భారతదేశం మొత్తంలో స్ఫూర్తి నింపింది. త్రివిధ దళాల ధైర్యానికి, ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించి సైన్యానికి అండగా ఉన్న ప్రధానమంత్రికి ధన్యవాదాలు. మేమంతా మీతో ఉన్నాం.
పవన్‌కల్యాణ్
న్యాయం జరిగింది.. జైహింద్
అల్లు అర్జున్
తగిన న్యాయం జరిగింది. మేరా భారత్ మహాన్. సైనికులకు సెల్యూట్
మహేశ్‌బాబు
మన ఆర్మీ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. జైహింద్
ఎన్టీఆర్
జైహింద్.. ఆపరేషన్ సిందూర్
నాని
మేం సిందూరాన్ని సంప్రదాయ తిలకంగానే కాదు. మా అచంచల సంకల్పానికి చిహ్నంగానూ ఉపయోగిస్తాం. మాకు ఎన్ని సవాళ్లు ఎదురైనా నిర్భయంగా, గతం కంటే బలంగా వస్తాం. భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, బీఎస్‌ఎఫ్‌లోని ప్రతి ధైర్యవంతుడికీ వందనాలు. మీ అందరి ధైర్యం మా గర్వాన్ని మరింత పెంచుతుంది. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది. జైహింద్.
మోహన్‌లాల్
రియల్ హీరోలకు సెల్యూట్. దేశం కోసం ఇండియన్ ఆర్మీ ఏం చేయగలదో ఆపరేషన్ సిందూర్‌తో మరోసారి రుజువైంది. దేశం గర్వపడేలా చేశారు. జైహింద్
మమ్ముట్టి
ప్రజల భద్రత కోసం ప్రార్థిద్దాం. ఉగ్రవాదం, దాడులు అనే పదాలు లేకుండా ప్రజలు ప్రశాంతమైన జీవితాలను గడిపే రోజు కోసం ఎదురుచూస్తున్నా. ప్రశాంతంగా, సుసంపన్నంగా జీవిద్దాం. జైహింద్.
విజయ్ దేవరకొండ
భారత్ మాతా కీ జై.. న్యాయం జరిగింది.
ఖుష్బూ
పహల్గాం ఉగ్రదాడికి సమాధానం ఆపరేషన్ సిందూర్. జైహింద్.
కల్యాణ్‌రామ్
ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతోనే భారత్ చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. మన దేశం లక్ష్యాలను నిర్దేశించు- కోవడంలో సంయమనం పాటించింది. 26 మందిని దారుణంగా చంపినందుకు మాత్రమే ఈ చర్యలు జరిపింది. మేం నిబద్ధతకు కట్టుబడి ఉంటాం. ప్రకాశ్‌రాజ్