16 March, 2026 | 7:04 AM

దళారులను నమ్మి మోసపోవద్దు

16-03-2026 12:00 AM

శనగ కొనుగోలుకేంద్రం ప్రారంభం: మంత్రి జూపల్లి కృష్ణారావు

చిన్నంబావి, మార్చి 15: మండల పరిధిలోని కొప్పునూర్ గ్రామంలో ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పర్యాటక,సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ఆదివారం శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్ర భుత్వం శనగ రైతుల కోసం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు.ఈ శనగల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్విని యోగం చేసుకోవాలని,దళారుల బెడద లేకుండా రైతులు నేరుగా శనగలను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు.

రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని లేదా పంటను దళారులకు తక్కువ ధరకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక కొనుగోలు కేంద్రాలు లేదా మార్కెట్ యార్డుల ద్వారా గిట్టుబాటు ధర పొందాలన్నారు. ప్రభుత్వం క్వింటా మద్దతు ధర రూ.5,875 లుగా ప్రభుత్వం నిర్ణయించిందని, శనగలో తేమ శాతం 14 ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, రామచంద్రారెడ్డి బీచుపల్లి యాదవ్,చిదంబర్ రెడ్డి,సింగిల్ విండో మాజీ చైర్మన్ నరసింహా రెడ్డి,సాగర్ రావు,వడ్డెమన్ బిచ్చ న్న, జయమ్మ,ఆంజనేయులు, నరేష్, కత్తి జానీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.