16 March, 2026 | 8:29 AM

నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

16-03-2026 12:00 AM
  1. బోయిన్పల్లిలో రూ.3.05 కోట్లతో 33/11 కేవీ సబ్స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి 

రెండేళ్లలో జడ్చర్లకు 22(33/11kv), 133/11kv సబ్స్టేషన్లు మంజూరు : మ్మెల్యే అనిరుద్ రెడ్డి

జడ్చర్ల /మిడ్జిల్, మార్చ్ 15: నాణ్యమైన విద్యుత్తు వినియోగదారులకు అందించడం ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మిడ్జిల్ మండలంలోని బోయిన్పల్లి గ్రామంలో రూ.3.05 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్నురాష్ట్ర క్రీడలు, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభిం చారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. కొత్తగా ఏర్పా టు చేసిన ఈ 33/11 కేవీ సబ్స్టేషన్ ద్వారా మిడ్జిల్ మండలంలోని పలు గ్రామాలకు నిరంతరాయంగా మరియు నాణ్యమైన వి ద్యుత్ సరఫరా అందుతుందని అన్నారు.

రైతులు, గృహ వినియోగదారులు మరియు చిన్న పరిశ్రమలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి నిరంతరం సీఎం, మంత్రులతో నిధుల కోసం కృషి చేస్తుంటారని మంత్రి ప్రశంసించారు. పనిచేయాలనే పట్టుదల కలిగిన నాయకుడిని జడ్చర్ల ప్రజలు ఎన్నుకున్నందుకు అదృష్టవంతులని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అలాగే మన జిల్లా వాసి అయిన సీ ఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న సా గునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.అనంతరం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ మిడ్జిల్ మండల ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సబ్స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

దీని ద్వారా విద్యుత్ లోడ్ తగ్గి, తరచూ ఎదురయ్యే విద్యుత్ అంతరాయాలు తగ్గి ప్రజలకు మెరుగైన సేవలు అం దుతాయని చెప్పారు.స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే వరకు జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 31 సబ్స్టేషన్లు మాత్రమే ఏర్పాటు కాగా, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత గత రెండు సంవత్సరాలలోనే 22 (33/11 కేవీ) సబ్స్టేషన్లు, అలాగే నవాబ్పేట్లో 133/11 కేవీ సబ్స్టే షన్ మంజూరు చేయించామని తెలిపారు. వాటిలో భాగంగా బోయిన్పల్లి గ్రామంలో మొదటి సబ్స్టేషన్ను మంత్రి శ్రీహరి ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు.

ఈ రెండు సంవత్సరాల కాలంలో జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధికి రూ.213 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టేవారని, పనులు మా త్రం పూర్తి కాలేదని విమర్శించారు. తాను కొబ్బరికాయ కొడితే పని పూర్తయ్యే వరకు నిద్రపోనని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.