11-01-2026 12:00:00 AM
తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): ఆల్మంట్ కిడ్ సిరప్ వాడొద్దని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. ఈ సిరప్‌లో ఇథలీన్ గ్లుకాల్ కలుషితమై విషపూరితమైనట్లు గుర్తించారు. దీంతో ఈ సిరప్ విని యోగాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఈమేరకు కోల్‌కతాలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి హెచ్చరికలు అందడంతో ఈ సిరప్ ఎవరి దగ్గరైనా ఉంటే దాని వాడకం, విక్రయాలు నిలిపివేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే డీసీఏ హెచ్చరిక నోటీసు జారీచేసింది. అధికారులకు అప్రమత్తం చేసింది. బీహార్‌కు చెందిన ట్రైడస్ రెమెడీస్ అనే సంస్థ తయా రు చేసిన (బ్యాచ్‌నెం.ఏఎల్ చెందిన) ఈ సిరప్ వాడొద్దని సూచించింది.