10-01-2026 01:39:13 AM
ప్రారంభించిన సినినటీ నివేత పెతురాజ్
హైదరాబాద్, జనవరి 9: భారతదేశంలో అడ్వానస్డ్ స్కిన్, ఎస్తేటిక్ కేర్ రంగంలో ప్రముఖ సంస్థ వికేర్ హైదరాబాద్‌లో తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ)ను ఘనంగా ప్రారంభించింది. జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ హాజరై ప్రారంభించారు.ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన, ఆధునిక సాంకేతికతతో కూడిన వ్యక్తిగత స్కిన్ కేర్ సేవలను భారతదేశంలో అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేయబడింది.
ఈ సందర్భంగా సినీనటి నివేతా పెతురాజ్ మాట్లాడుతూ వికేర్ సెంట ర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వికేర్ సీఈఓ ము కుందన్ సత్యనారాయణన్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఎస్తేటిక్ ప్రమాణాలు వేగంగా మారుతున్నాయి.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా, చర్మాన్ని పై చికిత్సలకే పరిమితం చేయకుండా, బహుళ-స్థాయిల్లో సమగ్రంగా పరిష్కరించే విధానాన్ని అందిస్తున్నామని తెలిపారు. వికేర్ వ్యవస్థాపకులు ఈ కరోలిన్ ప్రభారెడ్డి మాట్లాడుతూ మేము ప్రవేశపెట్టే ప్రతి టెక్నాలజీ గ్లోబల్ క్లినికల్ వాలిడేషన్, ఎఫ్‌డీఏ క్లియరెన్స్, నిరూపిత ఫలితాల ఆధారంగా ఎంపిక చేయబడిందన్నారు.