calender_icon.png 11 January, 2026 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెన్నెముక సర్జరీకి భయపడొద్దు

11-01-2026 12:31:28 AM

  1. అందుబాటులోకి అత్యాధునిక ఎండోస్కొపిక్ సర్జరీ
  2. మెడికవర్ న్యూరో సర్జన్ డాక్టర్.రాజీవ్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): వెన్నెముక సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని, సర్జరీలకు భయపడాల్సిన పనిలేదని మెడికవర్ న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పున్ సర్జరీలపై వివరించారు. నడుం నొప్పి వచ్చిన ప్రారంభంలోనే స్పున్ సర్జరీ చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.

గతంలో మాదిరిగా స్పున్ ఓపెన్ సర్జరీలు లేవ ని, ఉత్తర తెలంగాణలోనే మొదటి సారిగా మెడికవర్లో అత్యాధునిక ఎండోస్కోపిక్ సర్జరీ అందుబాటులోకి రావడంతో కీ హోల్‌తో తక్కువ సమయంలో ఖచ్చితత్వంతో సర్జరీ పూర్తవుతుందన్నారు. ఒకటి రెండు రోజుల్లోనే పేషెంట్ రికవరీ ఉంటుందని, సాదారణంగా అన్ని పనులు చేసుకునే వీలు కలుగుతుందన్నారు. ఈ సర్జరీతో మజిల్ డ్యామెజ్, బోన్ రిమూవల్ చాలా తక్కువగా ఉంటుందన్నారు.

ముఖ్యంగా వ్యవసాయ పనులు, కూలీ పను లు చేసుకునే వారికి డిస్క్పై ఒత్తిడి పెరిగి లోబ్యా క్ పెయిన్తో బాధపడుతుంటారని కీ హోల్ సర్జరీ వీరికి మేలు చేస్తుందన్నారు. ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో అనెస్థేషియా హెడ్ డాక్టర్ వినయ్, ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ సత్యనారాయణ, క్రిటికల్కేర్ నిపుణులు డాక్టర్ పల్లవి, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, దాసరి చంద్రశేఖర్, మనోజ్ పాల్గొన్నారు.