11 March, 2026 | 2:43 AM

ఆడ, మగ మాట్లాడితే పెడర్థాలు తీస్తారా?

11-01-2026 12:00 AM
  1. కోమటిరెడ్డిపై బురదజల్లే ప్రయత్నం !
  2. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

సంగారెడ్డి, జనవరి 10 (విజయక్రాంతి): మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, కావాలనే ఆయనపై బుర దజల్లేందుకు కొందరు సోషల్ మీడియాలో కథనాలు రాస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దుయ్యబట్టారు. శనివారం ఆ యన మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డిపై వస్తున్న నిరాధార కథనాలను తీవ్రంగా ఖండించారు. ఎవరైనా దురుద్దేశపూర్వకంగా ఇలాంటి వార్తలు రాయాలని ప్రోత్సహించినా, అలా ప్రేరేపించినోడికి, ప్రేరేపిస్తే వేసినొడికి బుద్ధి లేదన్నారు.

ఒక ఆడ, మగ మాట్లాడితే పెడర్థాలు తీస్తారా అంటూ నిలదీశారు. ఇదొక ప్రజా సమస్యనా, రాష్ట్ర సమస్యనా? పనిగట్టుకుని బురద జల్లుతున్నారని విమర్శించారు. లక్షలు, కోట్లు అప్పు లు చేసి ప్రజలకు సర్వీస్ చేయడానికి వస్తాం, మమ్మ ల్నా మీరు బదనాం చేసేది అంటూ నిలదీశారు. కోమటిరెడ్డిపై వార్తలు రాయాలని చెప్పిన వాడికి బయటకు వచ్చి చెప్పే దమ్ముం దా? అంటూ జగ్గారెడ్డి సవాల్ విసిరారు.