11-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 10(విజయక్రాంతి): బీసీ మహిళలకు ప్రాతినిధ్యం లేని మహిళా బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వానికి బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశా రు.
శనివారం నిజామాబాద్ పట్టణంలోని న్యూ అంబేద్కర్ ఆడిటోరియంలో బీసీ ఉపాధ్యాయ సంఘం నిజామాబాద్ శాఖ ఆధ్వ ర్యంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలను జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారికి విఠల్ రావు, డీఈవో పార్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ముందుగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే దంపతులకు భారతరత్న అవా ర్డులు ప్రకటించి గౌరవించాలని, వారి విగ్రహాలను భారత పార్లమెంటులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం మహిళలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలనే ఉద్దేశంతో చట్టసభలలో మూడోవంతు రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేసిందని, ఈ చట్టం వలన బీసీ మహిళకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన తెలిపారు.
మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట కల్పించినప్పుడే మహిళా బిల్లుకు పరిపూర్ణత వస్తుందని ఆయన తెలిపారు. బీసీల విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని, ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎజెండాగా చేసుకునేలా అన్ని పార్టీలపై ఒత్తిడి పెంచామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సహకార ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
పూలే సావిత్రిబాయి పూలే ఆశయాలను బీసీ సమాజం ముందుకు తీసుకుపోవాలని ఊరికి ఒక మహాత్మ పూలే, ఇంటికొక సావిత్రిబాయి పూలేలు కావాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రె స్ ప్రభుత్వం వచ్చాకే తెలంగాణలో కులగణని నిర్వహించి బీసీల జనాభా 56% ఉం దని అధికారికంగా వెల్లడించామన్నారు. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన కేంద్రంలో కొద్దిగా కూడా చలనం లేదన్నారు.
బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత బీజేపీ నేతలపై ఉన్నప్పటికీ అది విస్మరించి, బీసీ రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంలో అర్థం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన, సామాజిక సేవలో నిమగ్నమైన మహిళలకు సావిత్రిబాయి పూలే అవార్డులతో సత్కరించారు సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ గౌడ్,గోపాల కృష్ణ చారి, నరాల సుధాకర్, శ్రీలత, యన్ విజయలక్ష్మి, బుస్స ఆంజనేయులు, శ్రీనివాస్, రమణ, కరిపే రవీందర్ తదితరులు పాల్గొన్నారు.