19-12-2025 08:49:01 AM
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా(Vikarabad District) పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఆర్ఎంపి డాక్టర్ రంగారావు (85) కన్నుమూశారు. గత 60 సంవత్సరాలుగా మండల ప్రజలకు వైద్య సేవలు అందించడంతో ప్రసిద్ధిగాంచారు. నేడు తెల్లవారుజామున అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు తాండూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యంలోనే తుది శ్వాస విడిచారు. సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు