calender_icon.png 19 December, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది సంస్కరణ కాదు.. సమాఖ్యవాదంపై దాడి

19-12-2025 10:21:33 AM

జీ రామ్ జీ బిల్లు పేరు మార్పు కాదు.. 

హైదరాబాద్:  జీ రామ్ జీ బిల్లు(G Ram Ji Bill) ఇది కేవలం ఎంజీఎన్ఆర్ఈజీఏ బిల్లులో పేరు మార్పు మాత్రమే కాదు, ఇది భారతదేశ సమాఖ్య స్ఫూర్తిపై ప్రత్యక్ష దాడి అని హరీశ్ రావు పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం(Central Government) 60:40 నిధుల నిష్పత్తి అనే నెపంతో, భారీ ఆర్థిక భారాన్ని రాష్ట్రాలపైకి మారుస్తూ, ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ఈ బిల్లు రాష్ట్రాల అధికారాలను తగ్గించి, కేంద్ర నియంత్రణను బలోపేతం చేయడానికి రూపొందించబడిందని ఆయన వెల్లడించారు.

60:40 నిష్పత్తిపై కాంగ్రెస్ మౌనం దాని కపటత్వాన్ని బయటపెడుతోందని ద్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉంటూ సమాఖ్య వాదాన్ని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే, కాంగ్రెస్ రాష్ట్రాలను బలహీనపరిచే బీజేపీ చర్యలకు రహస్యంగా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. అధికారాన్ని కేంద్రీకరించే విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకే పక్షాన నిలుస్తాయని ఈ బిల్లు నిరూపిస్తుందన్నారు. ప్రజల ఉపాధి హక్కు, రాష్ట్రాల స్వయంప్రతిపత్తి రెండూ ఏకకాలంలో బలహీనపర్చబడుతున్నాయని వెల్లడించారు. ఇది సంస్కరణ కాదు.. ఇది సమాఖ్యవాదంపై దాడిగా హరీశ్ రావు అభివర్ణించారు.