calender_icon.png 13 February, 2026 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగ్ విశ్వవిద్యాలయ విద్యార్థికి డాక్టరేట్ ప్రధానం

13-02-2026 05:56:27 PM

ఘట్ కేసర్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పరిశోధనా విద్యార్థి సుధమల్ల మల్లేష్  డీప్ లెర్నింగ్ ను ఉపయోగించి డీహేజింగ్ నుంచి ఉపగ్రహ చిత్రాల విజువలైజేషన్‌ను మెరుగుపరచడము అనే అంశంపై పరిశోధన చేసి పర్యవేక్షకులు డాక్టర్ డి.  హరిప్రియ సమక్షంలో తీసిస్ ను సమర్పించగా డాక్టర్ తోశన్లాల్ మీన్పాల్, అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్ఐటి, రాయ్ పూర్, అనురాగ్ విశ్వవిద్యాలయ పరీక్షల డీన్ ప్రొఫెసర్ ముత్తారెడ్డి, ఈసిఈ విభాగం అధిపతి డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ సికిందర్ బాబా, ఇతర విభాగాల అధిపతులు ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వైవ వైస్ పరీక్షలో తన పరిశోధనను విజయవంతంగా వివరించి, సమర్ధించాడు. పరీక్షకుల ప్యానెల్ సిఫార్సుల మేరకు,  సుధమల్ల మల్లేష్ ను డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీ హెచ్ డి) ని అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.