వైద్యం.. అందని ద్రాక్షేనా..?
చుట్టపు చూపుగా వస్తున్న వైద్యులు, సిబ్బంది
పల్లెల్లో ఉద్యోగం, పట్టణాల్లో నివాసం
బోయినపల్లి: ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న వైద్యులు వైద్య సిబ్బంది చుట్టపుగా విధులకు హాజరవుతూ అంటి అంటున్నట్లు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, వైద్యులు వైద్య సిబ్బంది, సబ్ సెంటర్లలో వైద్య సిబ్బంది స్థానికంగా ఉండి గ్రామీణ పల్లె ప్రజలకు వైద్య సేవలు అందించాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్న వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సబ్ సెంటర్లలో వైద్య సేవలు అందించాలి.
కానీ మీరు కరీంనగర్ ,జగిత్యాల , కోరుట్ల ,వరంగల్ పట్టణాల నుంచి విధులకు హాజరవుతూ వచ్చి వెళ్తున్నారు. పట్ట ణాలకే పరిమితమై వైద్యం అందని ద్రాక్ష పండేగా అన్నట్లుగా ఉన్నది. గ్రామీణ పల్లె ప్రాంతాల్లో ఎంతో మంది పేద ప్రజలు పట్టణాల్లో కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం కొనలేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తున్న వైద్యం మాత్రం వారికి అందడం లేదు. దీంతో వారు గ్రామాల్లోని ఆర్‌ఎంపీల ను ఆశ్రయించి వైద్యం తీసుకుంటుండగా, వారు తమ కమిషన్ కోసం వారికి నచ్చిన ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించి దండుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంటే సబ్ సెం టర్లలో వ్యాక్సినేషన్ వేయాల్సిన ఏఎన్‌ఎం లు పూర్తిగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఏఎన్‌ఎంలు ఆశా వర్కర్లు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి డెలివరీ చే యించాల్సి ఉండగా వారు విధులను నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. దీంతో సాధారణ కానుపులు చేసుకోవాల్సిన గర్భిణీలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లగా వారు తమ డబ్బుల కోసం సిజేరియ న్లు చేస్తున్నారు. తాజాగా బోయినపల్లి మం డలం కోరెం, కోదురుపాక సబ్ సెంటర్లలో ఏఎన్‌ఎంలు వ్యాక్సినేషన్ వేయకపోవడంతో బాధితులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖశాఖ అధికారికీ ఫిర్యాదు చేశారు.
ఇందులో కొదురుపాక ఏఎన్‌ఎం లక్ష్మీపై జిల్లా వైద్యరకశాఖ అ ధికారి చర్యల్లో భాగంగా మానాల కు బదిలీ చేయగా ఆమె ఉత్తర్వులను ఖాతరు చేయలేదని తెలిసింది. అదేవిధంగా కోరం ఏఎన్‌ఎం నిత్యం జగిత్యాల జిల్లా నుంచి విధులకు హాజరవుతున్నారు. వీరితోపాటు జిల్లాలో చాలామంది వైద్య సిబ్బంది పట్టణాల నుంచి మొక్కుబడిగా విధులకు హాజరవుతూ లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి కాగితాలు రికార్డులు చూడకుండా క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు వైద్యం అందే విధంగా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.




