14 April, 2026 | 5:13 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

18-10-2025 05:52 PM

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పి. సుందరయ్య నగర్ లో వ్యాధి నిరోధక టీకా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ.. నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు షెడ్యూల్ ప్రకారంగా ఇవ్వాలని అన్నారు. తల్లిదండ్రులు విధిగా పిల్లలకు టీకాలు ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర సిబ్బందితో అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు. రికార్డులు పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల పట్ల  నిర్లక్ష్యం ఉండకూడదని ఆదేశించారు.