19 May, 2026 | 4:26 PM

కుటుంబ వైద్యుల దినోత్సవం సందర్బంగా వైద్యులకు సన్మానం

19-05-2026 03:55 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవం సందర్బంగా ఇల్లెందు ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ వైద్యులను మంగళవారం సన్మానించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్, విమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనేషన్ ఆధ్వర్యంలో వైద్యులు డీసీహెచ్ డాక్టర్ రవిబాబు, సూపెరిండేంట్ డాక్టర్ హర్షవర్ధన్, ఆర్ ఎంఓ డాక్టర్ రాంనివాస్, డాక్టర్ భరత్, డాక్టర్ దేవేందర్, డాక్టర్ సింధు, డాక్టర్ సుధా, డాక్టర్ మాధురి, డాక్టర్ శారీష్మా లను సన్మానించారు.