15 July, 2026 | 12:22 PM

శ్వాసనాళంలో చిక్కుకున్న ఈలను తొలగించిన వైద్యులు

15-07-2026 12:20 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మలక్‌పేట్‌లోని యశోద ఆసుపత్రి వైద్యులు బ్రోంకోస్కోపీ ద్వారా 17 ఏళ్ల బాలుడి శ్వాసనాళంలో చిక్కుకుపోయిన ఈలను తొలగించినట్లు పల్మనాలజిస్ట్ డా. యుగంధర్ భట్టు తెలిపారు.  పదేపదే తగ్గని న్యుమోనియాతో బాధపడుతున్న బాలుడికి పరీక్షల అనంతరం శ్వాసనాళంలో ఈల ఉన్నట్లు గుర్తించి, శస్త్రచికిత్స లేకుండానే బ్రోంకోస్కోపీ ద్వారా తొలగించారు. దీంతో బాలుడు పూర్తిగా కోలుకుని, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు తగ్గినట్లు వైద్యులు తెలిపారు. వారితో పాటు అనస్థీషియాలజిస్ట్ డా. విక్రమ్ బృందం, క్రిటికల్ కేర్ హెడ్ డా. కలాధర్ పర్యవేక్షణలో  విజయవంతంగా పూర్తి చేశారు.