5 July, 2026 | 2:41 AM

పోరాట స్ఫూర్తికి రూపం దొడ్డి కొమురయ్య

05-07-2026 01:02 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపం దొడ్డి కొమురయ్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరులూదిన ధీరుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తిగాథను భావితరాలకు అందించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాటుపడిందని స్పష్టం చేశారు. దొడ్డి కొమురయ్య జయంతి, వర్థంతులను అధికారికంగా నిర్వహించి గౌరవించుకుందని గుర్తు చేశారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్థంతి సందర్భంగా వారికి కేటీఆర్ నివాళులు అర్పించారు.