1 June, 2026 | 12:56 AM

అభివృద్ధి అంటే ధ్వంసం చేయడమా?

01-06-2026 12:07 AM

డ్రైనేజీ స్లాపులు తొలగింపు పై ఆగ్రహం? 

భద్రాద్రి కొత్తగూడెం, మే 31, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని శివనగర్ ప్రధాన రహదారిపై డ్రైనేజీ పై నిర్మించిన స్లాపులు తొలగించి, వాటి స్థానంలో బండలు ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. రూ లక్షల వ్యయంతో డ్రైనేజీలపై స్లాబులు నిర్మించి రాకపోకలకు సులభతరంగా వినియోగంలో ఉన్న వాటినీ ధ్వంసం చేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

స్లాబులు తొలగించి శాశ్వత పరిష్కారం చూపకుండా కేవలం బండలను ఏర్పాటు చేయడం వెనక ఉద్దేశం ఏమిటని  ప్రశ్నిస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగంపై అధికారులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. విలువైన ప్రజాధనాన్ని బహిరంగంగా ధ్వంసం చేస్తున్న అధికారుల మౌనం వహించడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. తక్షణమే అధికారుల స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ప్రజల సొమ్ము తో నిర్మించిన స్లాబుల ధ్వంసం చేసే అధికారం ఎవరిచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు.