1 July, 2026 | 11:16 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఘట్‌కేసర్‌లో డాగ్‌స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

05-06-2025 12:35 AM

ఘట్ కేసర్, జూన్ 4 (విజయక్రాంతి) : ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి రైల్వే స్టేషన్, బస్టాండ్, దేవాలయం, మసీద్ , ఆర్టీసీ బ స్టాండ్ మరియు అత్యధిక జన సమూహం కలిగిన షాపింగ్ మాల్స్ , మార్ట్ లు తదితర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ స్క్వాడ్ లతో బుధవారం తనిఖీలు జరిపిన ట్లు సీఐ పందిరి పరశురామ్ తెలిపారు.

రాచకొండ కమీషనర్ జి. సుధీర్ బాబు  ఐపీఎస్ ఆదేశాల మేరకు జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రతి చోట క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పరిశీలించినట్లు సీఐ పరశురాం పేర్కొన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని మరి యు ప్రజలకు భద్రత కల్పించేందుకు రాచకొండ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నామనీతెలిపారు.