17 April, 2026 | 9:43 PM

Breaking News

అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •  

వైద్యం అందక బాలింత మృతి

05-06-2025 12:35 AM

నాగర్ కర్నూల్ జూన్ 4 (విజయక్రాంతి); ప్రసవం కోసం వచ్చిన మహిళకు సరైన వైద్యం అందక మృత్యువాత పడిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిట ల్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కొల్లాపూర్ నియోజక వర్గం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన కాట్రావత్ వనజ (32) రెండవ కాన్పు కోసం జిల్లా కేంద్రంలోని సత్యసాయి నర్సింగ్ హోమ్ ఆస్పత్రికి వచ్చారు. సిజేరియన్ ద్వారా మగ బిడ్డకు జ న్మనిచ్చింది.

అనంతరం ఇతర సమస్యలతో బాధపడుతున్న బాలింతకు పరీక్షలు జరిపిన వైద్యు లు ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని గుర్తించి పలమనాలజీస్ట్ వైద్యుల సాయంతో వైద్య పరీక్షలు జరిపారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించాగా మృతి చెందినట్లు తెలిపారు. తమ బిడ్డ మృతికి కారణం ఆస్పత్రి యాజమాన్య నిర్లక్ష్యమే అంటూ బుధవారం బాధితులు ఆస్పత్రి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు.

దీనిపై ఆసుపత్రి వైద్యులు శ్రీనివాసులను వివరణ కోరగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని ముందుగానే గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు. బాలింతను కాపాడేందుకు ఊ పిరితిత్తుల సంబంధిత వైద్యులచే ప్రయత్నం చేశామన్నారు. 108 వాహనంలో తరలించే క్రమంలోనూ వైద్యుడి పర్యవేక్షణలోనే తరలించినట్లు తెలిపారు. అనంతరం న్యాయం చేయాలని కో రుతూ బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు, అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద  ప్రధాన రహదారిపై రాస్తారోకోచేపట్టారు