8 April, 2026 | 1:58 AM

19 డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్లు స్వాధీనం

08-04-2026 12:14 AM

బాధ్యుడిపై కేసు నమోదు.. విజయక్రాంతి వార్తకి స్పందన..

బెజ్జంకి, ఏప్రిల్ 7: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిల్వ చేసిన ఘటనపై వచ్చిన సంచారం, ఇటీవల విజయక్రాంత్రి దినపత్రికలోడొమెస్టిక్ అక్రమ వినియోగం అని ప్రచురితం కాగా అధికారులు స్పందించి. డీసీఎస్‌ఓ, డీఎల్‌ఎం, ఏసీఎస్‌ఓ, డీటీ (సివిల్ సప్లైస్) బృందం సంయుక్తంగా మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.

డిసిఎస్ ఓ మాట్లాడుతూ తనిఖీల్లో బేగంపేట గ్రామంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ ఎదురుగా ఉన్న ఓ నివాస గృహంలో 19 గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు (హెచ్ పి, భారత్, ఇండేన్) అనుమతులు లేకుండా నిల్వ ఉంచినట్లు తెలిపారు. సిలిండర్లను స్వాధీనం చేసుకుని సమీప గ్యాస్ ఏజెన్సీ లో భద్రపరిచారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి నియమావళి ప్రకారం చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. గృహ వినియోగానికి కేటాయించిన డొమెస్టిక్ గ్యాస్ను అధిక ధరలకు విక్రయించడం లేదా కమర్షియల్ అవసరాలకు మళ్లించడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. రెండు కంటే ఎక్కువ నిల్వ చేసిన,  ఏలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.