calender_icon.png 8 July, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరికొన్ని గంటల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం

20-01-2025 08:08:50 PM

వైట్ హౌస్,(విజయక్రాంతి): మరికొన్ని గంటల్లో అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం(Donald Trump Sworn In) చేయనున్నారు. ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది.  వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ లోని రోటుండా ఇండోర్ లో సోమవారం రాత్రి 10.30 గంటలకు 47వ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ స్వీకారోత్సవానికి వివిధ దేశాల నుంచి విచ్చేసే దేశాధినేతలకు శ్వేతభవనం ఆహ్వానం పలుకానుంది. ట్రంప్ ప్రమాణానికి భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరపున విదేశాంగమంత్రి జైశంకర్ వెళ్తారు. ఆయన మోదీ పంపించిన లేఖను డొనాల్డ్ ట్రంప్ కు అందజేయనున్నారు.