calender_icon.png 5 February, 2026 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనత్‌నగర్ అభివృద్ధికి మరో అడుగు

05-02-2026 05:51:20 PM

రూ. 56.40 లక్షల పనులకు శంకుస్థాపన చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్

సనత్‌నగర్ ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ప్రజల అవసరాలను తెలుసుకొని వాటిని పరిష్కరించడం నా బాధ్యత అని. మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. అన్నారు. గురువారం సనత్ నగర్ డివిజన్ లో పర్యటించి 56.40 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారు. ముందుగా భగత్ సింగ్ పార్క్ లో 4.90 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్క్ లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

స్పందించిన ఆయన అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం SRT లో 20.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. అక్కడి నుండి లింగయ్య నగర్ లోని గౌతమ్ స్కూల్ వద్దకు చేరుకొని అక్కడ 14.20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు పనులను ప్రారంభించారు. చివరగా అశోక కాలనీలోని  పార్క్ వద్ద 16.80 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. 2014 తర్వాతనే సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పూర్తి చేయడం జరిగిందని, దీర్ఘకాలిక సమస్యలు అనేకం పరిష్కరించినట్లు తెలిపారు. కాలనీలు, బస్తీలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను ఒకే విధంగా అభివృద్ధి చేసిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.

ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా అన్ని రోడ్లను అభివృద్ధి చేశామని, అవసరమైన ప్రాంతాల్లో నూతన డ్రైనేజీ, వాటర్ లైన్ ల ఏర్పాటు, మరికొన్ని చోట్ల పైప్ లైన్ ల పునరుద్ధరణ వంటి అనేక పనులు చేసినట్లు వివరించారు. నియోజకవర్గ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి లో ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో తాను పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, అమీర్ పేట DC సుజాత, DE రమేష్, AE జమీర్, వాటర్ వర్క్స్ మేనేజర్ హిందూజా, ఎలెక్ట్రికల్ DE సుధాకర్, హార్టికల్చర్ అధికారి సిద్దు, టౌన్ ప్లానింగ్ ACP రమేష్, శానిటేషన్ DE వెంకటేష్, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, ఖలీల్, కరుణాకర్ రెడ్డి, రాజేష్ ముదిరాజ్, కొలన్ భూపాల్ రెడ్డి, పీయూష్ గుప్తా, బాలరాజ్, జమీర్, పురుషోత్తం, ఇబ్రహీం, సమి ఉల్లా తదితరులు పాల్గొన్నారు.