22 April, 2026 | 10:06 AM

రాజన్న ఆలయానికి భారీ విరాళం ఇచ్చిన సికింద్రాబాద్ వాసి

27-06-2024 04:55 PM

రాజన్న సిరిసిల్ల : వెములవాడ రాజన్న ఆలయానికి సికింద్రాబాద్ వాసి రూ.35 లక్షలు విరాళంగా ఇచ్చారు. సికింద్రాబాద్ కు చెందిన గల్లా గుండయ్య గురువారం రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి రూ.35 లక్షలు విరాళంగా అందించారు. ఇందులో అన్నదాత ట్రస్ట్ కు రూ.25 లక్షలు, గోశాల నిర్వహణకు రూ.10 లక్షలు విరాళంగా అందజేసినట్లు గురువారం తెలిపారు.