గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం.. ఒకరి అరెస్ట్
హైదరాబాద్: మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కి రైల్లో గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర నిందితుడిని గురువారం సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 3.5 లక్షల విలువైన 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటను సంబంధించిన వివారాలను సికింద్రాబాద్ జీఆర్పీ డీఎస్పీ జావేద్, ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌తో కలిసి వెల్లడించారు.
ఒడిశా రాష్ట్రం, రాయగడ జిల్లా చంద్రపూర్ ఠాణా పరిధిలోని గుండూరివాడకు చెందిన బహన్ స్వల్సెంగ్ గంజాయితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఈ క్రమంలో రైల్లో తనిఖీలు చేపట్టిన జీఆర్పీ సిబ్బంది నిందితుడి బ్యాగును కుడా తనిఖీ చేయగా.. బ్యాగులో గంజాయిని గుర్తించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి విచారించడంతో భరత్ అనే వ్యక్తితో కలిసి గంజాయి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు పరారీలో ఉన్న భరత్ కోసం దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.






