బైకును ఢీకొన్న లారీ.. ఒకరి దుర్మరణం
27-06-2024 04:10 PM
జడ్చర్ల : మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామం దగ్గర జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ నుంచి రాజాపూర్ వైపు వస్తున్న బైకును ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడిని రాజాపూర్ మండలం కుచ్చర్ కల్ గ్రామానికి చెందిన పృథ్విగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పృథ్వి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.






