3 July, 2026 | 9:00 PM

Breaking News

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •  

సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం

03-07-2026 08:24 PM

కల్లూరు,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేసిన తోపుడు బండి ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వర్గీయ సాధిక్ అలీ 63వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి ఉషా శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల కోసం 15 డ్యూయల్ డెస్క్‌లను విరాళంగా అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. రత్న మాధురి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పి. పద్మ మాట్లాడుతూ, సాధిక్ అలీ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విశేష సేవలందించారని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్ నీరజ ప్రభాకర్ ఆయన ఆశయాలను ఉషా కొనసాగించడం అభినందనీయమని అన్నారు.

పురపాలక సంఘ చైర్మన్ డి. మోహన్ సాధిక్ అలీతో తన స్నేహాన్ని గుర్తు చేసుకుని ఆయన సేవలను కొనియాడారు. ఆర్యవైశ్య జిల్లా మహాసభ అధ్యక్షులు పసుమర్తి చంద్రరావు కరోనా కాలంలో పేద విద్యార్థులకు ఆయన అందించిన సహాయాన్ని ప్రశంసించారు. ఉషా మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో సాధిక్ అలీ కృషి చేశారని, అదే మార్గంలో తాను సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి నివాళులు అర్పించారు. ఉషా దాతృత్వాన్ని పురపాలక సంఘ పెద్దలు, శాంతినగర్ పెద్దలు సన్మానించారు. పాఠశాలకు వుడెన్ ర్యాక్ అందించిన కంటిపూడి మేరమ్మను కూడా సత్కరించారు.