3 July, 2026 | 9:15 PM

Breaking News

వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •  

దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా

03-07-2026 08:27 PM

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని భగత్ సింగ్ సెంటర్లో దేవ్ విజన్ సెంటర్ అండ్ ఆప్టికల్స్  సిపిఐ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో కంటి సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారని, దూరం ప్రాంతాలకు వెళ్ళి పరీక్షలు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నా నేపథ్యంలో,మండలకేంద్రంలో  కంటి వైథ్యశాల పెట్టఢం ఇక్కడే కంటి పరీక్షలు చేసుకుని అవసరమైన కళ్ళజోళ్ళు ఇవ్వడం వలన ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అలాగే ఇక్కడ ప్రజలు ఆర్థికంగా వెనకబడి ఉండడం వల్ల బీద ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత ఆపరేషన్లు నిర్వహించే విధంగా యాజమాన్యం దృష్టిసారించాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు.  అనంతరం ఆళ్లపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గంగమ్మ తల్లి ఆలయానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.