17 July, 2026 | 7:59 PM

మొదటి జీతం దేవాలయానికి విరాళం

03-06-2024 12:55 AM

యాచారం మండల పరిధిలోని నందివనపర్తికి చెందిన కొండూరు కవిత, అంజయ్య కుమార్తె కొండూరి వర్ష ఆదివారం తన మొదటి నెల జీతం రూ. 41,735 విరాళంగా అందజేసింది. కొలువుల కల్పవల్లిగా విరాజిల్లుతున్న జ్ఞానసరస్వతి అమ్మవారి అనుగ్రహంతోనే వర్షకు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం రావడం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. అనంతరం ఆలయ సభ్యులు వర్షను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.