ఫోన్ వైద్యం.. నర్సు ట్రీట్మెంట్.. గర్భిణి మృతి
- ప్రాణం ఖరీదుకు సీఐ చాంబర్‌ల్లో రాయ‘బేరం’
- నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రవేటు దవాఖాన నిర్వాకం
నాగర్‌కర్నూల్, జూన్ 2 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యులు లేకుండానే ఫోన్ ద్వారా నర్స్‌కు ఆదేశాలు ఇవ్వడంతో ట్రీట్మెంట్ వికటించి ఆరు నెలల గర్భిణి మృతిచెందింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన పోలీసులు రాయ‘భేరం’ నడపడం గమనార్హం. ఈ దారుణ ఘటన ప్రియాంక దవాఖానలో ఆదివారం చోటుచేసుకుంది. తాడూరుకు చెందిన ఏర్రోళ్ల పద్మ (35) ఆరు నెలల గర్భిణి. కడుపునొప్పితో బాధపడుతూ ఆదివారం ప్రియాంక దవాఖానకు వచ్చింది.
స్త్రీల వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో ఫొన్‌లో మాట్లాడుతూ.. నర్సు ట్రీట్మెంట్ చేసింది. కాసేపటికే పద్మ తీవ్ర అస్వస్థతతో సృహకోల్పోయింది. వెంటనే జిల్లా దవాఖానకు రెఫర్ చేసి చేతులు దులిపేసుకున్నారు. అప్పటికే పద్మ మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. పద్మ మృతికి ప్రియాంక దవాఖాన నిర్వాహకులే కారణమని ఆరోపిస్తూ బంధువులు ధర్నా చేపట్టారు. రంగంలో దిగిన పోలీసులు బాధితులను చెదరగొట్టారు.
దీంతో ఆసుపత్రి ముందు కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మృతురాలి భర్త మహేందర్ ఫిర్యాదు చేసినా తీసుకోకుండా పోలీసులలే దగ్గరుండి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. గర్భిణి ప్రాణం ఖరీదు రూ.౪ లక్షలుగా వెలకట్టారు. విషయం తెలుసుకున్న ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్ సీరియస్ అయ్యారు. ఇక కేసు నమోదవుతుందని భావించిన ప్రియాంక దవాఖాన యాజమాన్యం.. బాధితులపై బెదిరింపులకు దిగుతుందని ప్రచారం జరిగింది. స్పందించిన జిల్లా వైద్యాధికారి ప్రియాంక దవాఖానను సందర్శించి, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామన్నారు.
బానిసత్వం తొలగేదాక పోరాటం
సూర్యాపేట, జూన్ 2 (విజయక్రాంతి): బానిసత్వం తొలగిపోయే దాకా పీవోడబ్ల్యూ పోరాడుతుందని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ కేంద్ర కమిటీ సభ్యురాలు కే రమ స్పష్టంచేశారు. సూర్యాపేటలో నిర్వహిస్తున్న పీవోడబ్ల్యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మనిషి భూమి మీద పుట్టినప్పుడు ఎలాంటి తారతమ్యా లు, బంధాలు, అనుబంధాలు లేవ ని.. కాలక్రమంలో అవసర రీత్యా ఏర్పడ్డాయని తెలిపారు. మనువాదం వచ్చాక పురుష ఆధిక్యం కొనసాగి స్త్రీలను పిల్లలు కనే వస్తువులుగా చిత్రీకరించారని ఆరోపిం చారు. పితృసామ్య పాలన, బానిసత్వానికి వ్యతిరేకంగా మహిళలను చైతన్యం చేసి పోరాట పాఠాలను నేర్పాలన్నారు.






