27 July, 2026 | 7:54 PM

Breaking News

తరుగు పేరుతో రూ.71 లక్షల అవినీతి   •   మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •  

సురంగల్ ప్రభుత్వ పాఠశాలకు రూ.లక్ష విరాళం

04-06-2026 01:24 AM

కౌన్సిలర్ శ్రీధర్ చొరవతో ముందుకొచ్చిన 13వ వార్డు ఇన్చార్జ్

మొయినాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ని సురంగల్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు ఇన్చార్జ్ యాలాల జైపాల్ రెడ్డి రూ.1 లక్ష విరాళంగా అందజేశారు. పాఠశాల భవనానికి నూతనంగా రంగులు వేయించి విద్యార్థులకు మెరుగైన వా తావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు.

పాఠశాల భవనం పాతబడిన పరిస్థితిని 14వ వార్డు కౌన్సిలర్ కర్రల శ్రీధర్ జైపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి విరాళం ప్రకటించారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జహీర్ మాట్లాడుతూ, విద్యాభివృద్ధికి ముందుకొచ్చి సహాయం చేసిన జైపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పాఠశాల అభివృద్ధికి అందించిన ఈ సహాయం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కౌన్సిలర్ కర్రల శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతిభలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోరని అన్నారు. అయితే సౌకర్యాలు, మౌలిక వసతుల పరంగా ప్రభుత్వ బడులు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆకర్షణీయంగా, ఆధునికంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.