27 July, 2026 | 6:55 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

అంగన్వాడీ సమస్యలపై డీడబ్యూఓకు వినతి

04-06-2026 01:26 AM

కౌన్సిలర్ సద్ది సురేష్ రెడ్డి

మేడ్చల్ అర్బన్ జూన్ 3 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ పరిధిలోని నూతన్‌కల్ పట్టణంలో రెండు అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయని వాటిలో టీచర్ లు లేక అంగన్వాడి కేంద్రాలు మూసివేయడం జరిగిందని మున్సిపల్ కౌన్సిలర్ లు సద్ది సురేష్ రెడ్డి, చిన్నోళ్ల భాస్కర్ లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో నూతన్ కల్ పట్టణంలో మూసి వేయబడిన అంగన్వాడి కేంద్రాలలో వేరే ప ట్టణం నుండి తాత్కాలికంగా ఇంచార్జి లతో నడపడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు.అదేవిధంగా నూతన్ కల్ పట్టణంలో గల రెండు అంగన్వాడి కేంద్రాలలో టీచర్ లు ఆయమ్మలు లేకపోవడంతో పిల్లలు చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కౌన్సిలర్ లు సద్ది సురేష్ రెడ్డి, చిన్నోళ్ల భాస్కర్ లు ఆవేదన వ్యక్తం చేశారు.

కాబట్టి నూతన్ కల్ మున్సిపల్ పట్టణంలో పట్టణ ప్రజల కోరిక మేరకు రెండు అంగన్వాడి కేంద్రాలలో టీచ ర్ లు, ఆయమ్మలను ఏర్పాటు చేసి సమస్యలను తీర్చాలని వారు డిడబ్యుఓ కు విజ్ఞప్తి చేశారు.ముఖ్యంగా నాలుగు వేల పైచిలుకు పోషక పదార్థాల విషయంలో అంగన్వాడి లో పిల్లలను పంపే సందర్భంగా పట్టణ ప్రజలు చాల ఇబ్బందులకు గురవుతున్నారని కౌన్సిలర్ లు సద్ది సురేష్ రెడ్డి తెలిపారు.

నూతన్ కల్ మున్సిపల్ పట్టణంలోని రెండు అంగన్వాడి కేంద్రాలలో టీచర్ లతో పాటు ఆయాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు.అంగన్వాడి కేంద్రాలలో టీచర్ లతో పాటు ఆయాలను ఏర్పాటు చేయాలని కోరగా డిడబ్ల్యుఓ సానుకూలంగా స్పందిస్తూ రెండు నెలలలో సమస్యను తిరుస్తామని ఆమె హామీ ఇచ్చినట్లు సద్ది సురేష్ రెడ్డి వెల్లడించారు.