4 June, 2026 | 2:06 AM

రోడ్ల సమస్యలపై మున్సిపల్ కమిషనర్‌కి వినతి

04-06-2026 01:22 AM

ఘట్ కేసర్, జూన్ 3 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలో రోడ్ల నిర్మాణం సమస్యల విషయంపై మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ బుధవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కి వినతిపత్రం పంపించారు. ముందుగా ఆయన నిర్మాణంలో ఉన్న రోడ్లను, డ్రైనేజీ పైప్ లైన్ లను పరిశీలించారు.

శివారెడ్డిగూడ చౌరస్తా నుండి మాధవరెడ్డి వంతెన వరకు హెచ్.ఆర్. డి.సి.ఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న రో డ్డు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, ల్యాండ్ అక్విజిషన్ చేపట్టడంలో ఘట్కేసర్ సర్కిల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 100 ఫీట్ల రోడ్డు ఏ ర్పాటుకు అవసరమయ్యే ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా నోటీసులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, రోడ్డులో ఉన్న మ్యా నువల్స్, పైప్ లైన్ కూడా రిపేరింగ్ చేయకుండా కాంట్రాక్టర్, సర్కిల్ అధికారులు ని మ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు.

గత 3 నెలల క్రితం కూడా ఈ విషయమై ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా నారాయణ గార్డెన్ నుండి లక్కీ వైన్స్ ఎదులాబాద్ రోడ్డు వరకు మంజూరు అయిన టెండర్ అయిన రోడ్డు ప్రారంభించకుండా ప్రజలను తీవ్రఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. రైల్వే వంతెన హెచ్ ఆర్ డి సి ఎల్  రోడ్డు నిర్మాణం, వివిధ అభివృద్ధి పనుల ఏర్పాట్లలో సర్కిల్ అధికారుల నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారని పేర్కొన్నారు. డివిజన్  సమస్యలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కారం చేస్తారని కమిషనర్ కు పంపిన వినతిపత్రంలో పేర్కొన్నారు.