15 April, 2026 | 5:18 AM

శ్రీశైలం క్షేత్రంలోని పద్మశాలి సేవా సమితికి విరాళం

21-10-2025 12:25 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు ఐటిపాముల రవీంద్ర తన పుట్టినరోజు సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలోని పద్మశాలి సేవ సమితికి 25,116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్ర కు శ్రీశైలం క్షేత్రం దేవాదాయ శాఖ వారు  అభినందనలు తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని శాలువాతో సన్మానించి, మెమెంటోను అందజేశారు.