calender_icon.png 21 October, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ సస్యశ్యామలం

21-10-2025 12:31:10 PM

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తెలంగాణ సస్యశ్యామలం అయిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్సారెస్పీ క్యాంప్ ఆఫీస్ చుట్టూ రూ.28.64 లక్షలతో నిర్మించ తలపెట్టిన ప్రహరి గోడ నిర్మాణానికి  ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రాజెక్టు ను ప్రధాని నెహ్రూ చొరవతో నిర్మించిన అనంతరం ప్రధాని ఇందిరాగాంధీ 1981లో ప్రారంభించడం జరిగిందన్నారు.

అలాగే, ఎస్సారెస్పీ, కాకతీయ మెయిన్, ఉపకాల్వల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాలు బీడు భూముల నుండి సాగుకు నోచుకొని సస్యశ్యామలం అయ్యాయని ఆయన గుర్తు చేశారు. లోయర్ మానేరు డ్యాం నిర్మాణం సైతం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రెండు లక్షల రుణమాఫీ, కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు, సాగునీటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతూ అనుక్షణం రైతుల వెన్నంటి ఉంటున్నామని చెప్పారు. త్వరలోనే సుల్తానాబాద్ లోని ఎస్సారెస్పీ క్యాంప్ ఆఫీసులకు నూతన భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

సుల్తానాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, బిరుదు కృష్ణ ,వేగోళం అబ్బయ్య గౌడ్, చిలుక సతీష్, దన్నయక దామోదర్ రావు, గాజుల రాజమల్లు, కల్లేపల్లి జానీ, పడాల అజయ్ గౌడ్, పన్నాల రాములు, కుమార్ కిషోర్, దున్నపోతుల రాజయ్య, చింతల రాజు, అమిరిశెట్టి రాజలింగం, తోరికొండ ప్రభాకర్ , గాదాసు రవీందర్,  ఎండీ రఫిక్ , ఎండీ, మోబిన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, ఎస్సారెస్పీ డిఈఈ  మధుమతి , ఏ ఈ తదితరులు పాల్గొన్నారు.