calender_icon.png 16 October, 2024 | 1:39 AM

ఖమ్మం మున్నేరు వరద బాధితులకు విరాళాల సేకరణ

12-09-2024 07:01:54 PM

కుమ్రంభీం అసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో  ఖమ్మం జిల్లాలో మున్నేరు గ్రామంలో భారీ వరద చేరుకొని ఇండ్లు వరదలో మునిగిపోవడంతో ఆర్థిక, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగి ప్రజలు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకున్న పరిస్థితుల నేపథ్యంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం సంఘం సభ్యులు జిల్లా కేంద్రంలో ప్రజల వద్ద నుంచి విరాళాల సేకరణ చేశారు. ప్రజలు పెద్ద మొత్తంలో ఆదుకోవాలని విన్నవించారు. ఖమ్మం జిల్లా మున్నేరు గ్రామం ప్రజలని ఆదుకోవాలని జిల్లాలోని మేధావులు కార్మికులు, రైతులు, ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు  సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం టికనంద్, గొడిసెల కార్తీక్,  తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొరెంగ మాలశ్రీ, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం నిఖిల్, జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి సతీష్, తదితరులు పాల్గొన్నారు.