14 August, 2026 | 11:20 AM

శ్రీబాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్దికి దాతలు ముందుకు రావాలి

14-08-2026 10:41 AM

ఘట్ కేసర్, ఆగస్టు 14 (విజయక్రాంతి) : పురాతనమైన ఆలయాల అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రె రాజేష్ అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధి వెంకటాపూర్ లో దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన తాళ్ళకుంట శ్రీబాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ ఏఈ ఎల్. భాగ్యలక్ష్మీ తో కలసి సొంత ఖర్చులతో చేపడుతున్న అభివృద్ది పనులను డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్ పరిశీలించారు.

వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయా నికి ఎన్ని ఆస్తులున్న అభివృద్ధికి నోచుకోవడం లేదని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలయాన్ని దాతల సహకారంతో అభివృద్ధి చేసి చూపుతామని తెలిపారు. ఈనెల 20వ తేదీ నుండి ప్రారంభం కానున్న కుంభాభిషేకం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అతి పురాతనమైన దేవాలయ అభివృద్ధికి దాతలు ముందకు రావాలని పిలుపునిచ్చారు. తాము మాటలు చెప్పడం లేదని చేతలతో పనులు చేసి చూపుతామని తెలిపారు. ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.