ఓకే వాహనం రెండు నంబర్లు పట్టుకున్న గస్తీ సభ్యులు
14-08-2026 10:13 AM
బోథ్, ఆగస్టు 14 (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో గత నెల రోజులుగా గ్రామస్తులు గస్తీ నిర్వహిస్తున్నారు. గ్రామంలో దొంగతనాలు జరగడంతో పాటు ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతుండడంతో గురువారం రాత్రి సమయంలో ఓ ద్విచక్రవాహాన్ని పట్టుకున్నారు. ఓకే వాహనంపై రెండు నెంబర్ ప్లేట్లు ఉండడంతో అనుమానం వచ్చి వాహనాన్ని నిలిపివేశారు. అంతేగాక వాహనంపై ముందు నెంబర్ వెనక మరో నెంబర్ ఉండడంతో వివాహనాన్ని వాహనంపై ఉన్న వ్యక్తులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని అదే రాత్రి పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించడం జరిగింది.






