calender_icon.png 17 May, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ కేసులకు భయపడం

17-05-2025 12:00:00 AM

  1. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం
  2. తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్

బోథ్, మే 16 (విజయ క్రాంతి): అక్రమ కేసులు బనాయించినంత మాత్రాన భయపడేది లేదని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్  అన్నారు. శుక్రవారం బోథ్ కోర్టు ప్రాంగణం లో తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడారు... ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని వేస్తున్న ఉద్యమ సమయంలో తుడుం దెబ్బ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు.

అప్పటి ప్రభుత్వం పెట్టిన ఆక్రమ కేసులకు శుక్రవారం జుడిషియల్ కోర్టు బోథ్ యందు హాజరైనట్టు తెలి పారు. ఎన్ని కేసులు పెట్టిన ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమం లో తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు కోడప నగేష్, జిల్లా నాయకులు రామే ల్లి భోజ్జన్న, మెస్రం భూమన్న ఐటిడిఏ మాజీ డైరెక్టర్  భూమన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కుడాల స్వామి, తుడుం దెబ్బ నాయకులు పాల్గొన్నారు.