calender_icon.png 23 August, 2025 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు

17-05-2025 12:00:00 AM

మంచిర్యాల, మే 16 (విజయక్రాంతి): జిల్లాలోని ట్రాన్స్ జెండర్లకు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు, ధృవప త్రాలు శుక్రవారం పంపిణీ చేశారు.

జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహిళలు, పిల్ల లు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసు కోవడం జరుగుతుందని, ఇందులో భాగం గా జిల్లాలో అర్హత గల ఏడుగురు ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు, ధృవపత్రాలు పంపిణీ చేశామని జిల్లా సంక్షేమశాఖ సీని యర్ అసిస్టెంట్ మల్లేష్ తెలిపారు. కార్యక్ర మంలో జిల్లా సంక్షేమ శాఖ జూనియర్ అసి స్టెంట్ శ్రీరామమూర్తి, ఎఫ్.ఆర్.ఓ.ఎండి. ఫర్జానా బేగం, ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు.