calender_icon.png 11 January, 2026 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిమ్స్‌లో టోటల్ ల్యాబొరేటరీ ఆటోమేషన్

11-01-2026 12:58:56 AM

తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ప్రారంభం

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ లోని తన ల్యాబొరేటరీలో అత్యాధునిక టోటల్ ల్యాబొరేటరీ ఆటోమేషన్ (టీఎల్‌ఏ) వ్యవస్థను విజయవంతంగా ప్రారంభించింది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల్లో తొలిసారి అమలు చేసిన సాంకేతికతగా నిలిచింది. ఈ కార్యక్రమానికి కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. బి. భాస్కర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు పాల్గొన్నారు.

కిమ్స్ హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ ల్యాబొరేటరీ మెడిసిన్ డా. రాధికా చౌదరి, కన్సల్టెంట్ బయోకెమిస్ట్ డా. మహమ్మద్ మొయినుద్దీన్ మాట్లాడుతూ.. టోట ల్ ల్యాబొరేటరీ ఆటోమేషన్ ద్వారా మానవ జోక్యం తగ్గి, ప్రీ-అనలిటికల్, అనలిటికల్ లో పాలు తగ్గుతాయని, బయోసేఫ్టీ మెరుగవుతుందని, పరీక్షల ఫలితాలు వేగంగా అందు తాయని తెలిపారు. ఈ టిఎల్‌ఏ వ్యవస్థ ద్వారా సాధారణ, అత్యవసర పరీక్షల సమ యం తగ్గడం, పరీక్ష ఫలితాల్లో స్థిరత్వం పెరగడం, రోగి భద్రత మెరుగవడం, ఎక్కువ సంఖ్యలో నమూనాలను సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం లభిస్తాయి.