15 April, 2026 | 5:49 AM

రేషన్ బియ్యం నాణ్యతలో రాజీ పడొద్దు

21-02-2026 12:23 AM
  1. పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

బాగ్ లింగంపల్లి గోదాం తనిఖీ చేసిన కమిషనర్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాం తి) : పేద ప్రజలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యంతో భోజనం చేయాలన్న మహత్తర సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు సివిల్ సప్లయ్‌శాఖ కమిషనర్  స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బియ్యం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని ఆయన అధికారులను కఠినంగా ఆదేశించారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న సివిల్ సప్లుసై గోదాంను కమిషనర్ స్టీపెన్ రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిల్వ ఉన్న బియ్యం సంచులను తెరిపించి నాణ్యతను పరిశీలించారు. బియ్యంలో నూక ల, తేమ శాతం వంటి అంశాలపై అధికారుల ను ప్రశ్నించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. గోదాంకు వచ్చిన బియ్యాన్ని స్వీకరించే దశలోనే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని,  ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిల్వలను తిరస్కరించాలని గోదాం ఇన్‌చార్జీలకు కమిషనర్ సూచించారు.  ప్రజలకు చేరే ప్రతి బియ్యంగింజ నాణ్యమైనదిగా ఉండేలా బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

సరఫరా వ్యవస్థ లో పారదర్శకత కోసం స్టాక్ రిజిస్టర్లు, ఇన్‌వర్డ్డ్-అవుట్‌వర్డ్ వివరాలు, రవాణా రికార్డులను కమిషనర్ పరిశీలించారు. గోదాంలో పని చేస్తున్న హమాలీలతో కమిషనర్ మాట్లాడా రు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో హైదరాబాద్ జిల్లా మేనేజర్  కె.సాయిఅరుణ్, అద నపు జిల్లా మేనేజర్ దీప్తి, గోదాం ఇన్‌చార్జీలు గోపాలకష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.