14 April, 2026 | 8:38 PM

ఇంజినీరింగ్ ఫీజులను పెంచొద్దు

22-02-2026 02:20 AM

ప్రభుత్వానికి ఏబీవీపీ డిమాండ్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో టీఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదించిన ఫీజుల పెం పును ప్రభుత్వం నిలిపివేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మా చెర్ల రాంబాబు డిమాండ్ చేశారు.

ఈమేరకు శనివారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలతో రేవంత్ రెడ్డి మిలాఖత్ అయ్యారని ఆరోపించారు. కళాశాలల ఆడిట్ రిపోర్ట్స్ బహిర్గతపర్చాలని డిమాండ్ చేశారు. 63 కాలేజీలల్లో ఏ ప్రాతిపదికన భారీగా ఫీజులు పెంపును ప్రతిపాదించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు.