రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వర్షాలు
పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఈనెల 23న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో, 24న ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని సూచించింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను శనివారం జారీ చేసింది.
ఇదిలా ఉంటే రెండు రోజులుగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. శనివారం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 35.7 డిగ్రీలు, ములుగు, జయశంకర్ భూపాలపల్లిలో 35.6, మంచిర్యాలలో 35.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ 31 డిగ్రీలపైనే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈమేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.




