calender_icon.png 18 February, 2026 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోడు సాగుదారులను ఇబ్బందులు పెట్టొద్దు

18-02-2026 01:15:31 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా 

పాల్వంచ, ఫిబ్రవరి 17, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మందెరికలపాడు, సత్యనారాయణపురం, సారెకల్లు, కారెకట్టు, ప్రభాత్ నగర్, ఉలవనూరు, రేగులగూడెం తదితర ప్రాంతాలలో పోడు సాగుదారుల సమస్యపై సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా నాయకత్వంలో పాయకారి యానం బైలు,చాతకొండ రేంజ్ పరిధి వైల్ లైఫ్. ఫారెస్ట్ డివిజనల్ అధికారి (ఎఫ్ డి ఓ)ని కలిసి ఫారెస్ట్ అధికారులు. పోడు సాగుదారులను చీటికిమాటికి ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు.

2023 లో సర్వే చేసిన భూములలో ట్రెంచ్ కొట్టడానికి ప్రయత్నించొద్దని గిరిజన, గిరిజనేతర పేదలు గత 30, 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడానికి ప్రయత్నించొద్దని ఎఫ్డిఓ బాబుని కోరారు. తరువాత పోడు సాగుదారులతో మాట్లాడుతూ కొత్తగా పోడు నరకవద్దని పాత భూములు సాగు చేసుకోవాలని, కొత్తగా పోడు నరికితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున 2023 కంటే ముందు ఉన్నటువంటి పోడు భూములు సాగు చేసుకోవడం మంచిదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం కొత్తగూడెం, పాల్వంచ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, సిపిఐ జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు, వైఎస్ గిరి, పాల్వంచ మండల నాయకులు, ప్రజాసంఘాల కార్యకర్తలు వేములపల్లి శ్రీనివాసరావు, చిల్లా కృష్ణ,చెన్నయ్య, శర్ప రాజేష్, బి మోహన్, ఉపసర్పంచ్. కే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.