నేడు దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్లు కేటాయింపు
06-06-2024 12:58 AM
1,066 కాలేజీల్లో 4.49 లక్షల సీట్లు
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) ద్వారా ప్రవేశాలను కల్పించనున్నారు. గురువారం దోస్త్ మొదటి విడుత డిగ్రీ సీట్లను విద్యార్థులకు కేటాయించనున్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలిలో మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడించనున్నారు. రాష్ట్రంలో 1,066 కాలేజీల్లో 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి.






