17 July, 2026 | 2:29 AM

మొదటి రోజు ఐసెట్‌కు 90 శాతం హాజరు

06-06-2024 12:59 AM

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌కు మొదటి రోజైన బుధవారం ప్రశాంతంగా జరిగినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ నర్సిహాచారి చెప్పారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు జరిగిన మొదటి సెషన్‌కు 28,931 మంది అభ్యర్థులకు 25,982 (89.81 శాతం) మంది హాజరయ్యారు. 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్‌కు 28,969 మంది అభ్యర్థులకు 26,298 (90.78 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. రెండు సెషన్లలో కలిపి 90.29 శాతం విద్యార్థులు పరీక్ష రాశారు. గురువారం కూడా ఐసెట్ పరీక్ష జరగనుంది.