17 July, 2026 | 3:03 AM

విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారాలు మానాలి

06-06-2024 12:57 AM

టీజీఎస్‌పీడీఎస్ జాయింట్ సెక్రటరీ డీ కోటేశ్వరరావు

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీజీఎస్‌పీడీసీఎల్ జాయింట్ సెక్రటరీ అండ్ డివిజనల్ ఇంజినీర్ డీ కోటేశ్వరరావు పేర్కొన్నారు. విద్యుత్ శాఖపై కావాలని కొందరు సోషల్ మీడియాలో చేసే అసత్య ప్రచారాన్ని వినియోగదారులు, మీడియా నమ్మొద్దని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. గతంలో కంటే అద్భుతంగా విద్యుత్ సిబ్బంది, అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు.

దురదృష్టవ శాత్తు కొన్ని నెలలుగా విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారాలు చేస్తూ కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. దాదాపు పదేళ్లు పెద్దపెద్ద పదవులు అనుభవించి ఇప్పుడు చౌకబారు అసత్య ప్రచారాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. లైన్‌లపై పనిచేయడం అత్యంత ప్రమాదకర పని అని, లక్షల కిలోమీటర్లు ఉండే లైన్ మీద చిన్న కొమ్మ, పావురం, గుడ్డ పడ్డా ఫీడర్ ట్రిప్ అవుతుందని, దానిని సరిచేయాలంటే గ్రామాల్లో ఆరు గంటలు, పట్టణాల్లో కనీసం నాలుగు గంటల సమయం పడుతోందని వివరించారు.