3 June, 2026 | 11:54 AM

డబుల్ రోడ్డా - డబ్బుల రోడ్డా

03-06-2026 10:37 AM

కొత్తగూడెం, (విజయక్రాంతి): లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామం నుండి కరకవాగు వరకు,డబుల్ రోడ్డు పనులపై లక్ష్మీదేవిపల్లి మండల భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) అధ్యక్షుడు,రెడ్డెం నవీన్ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రేగళ్ల గ్రామంలో మధ్య బజార్ మీదుగా గ్రామపంచాయతీ వరకు, జరుగుతున్న డబుల్ రోడ్డు పనులు అస్తవ్యస్థంగా చేపట్టడం జరుగుతోందని, అవి రోడ్డు విస్తరణగా కాకుండా, రోడ్డును కుంచించుకు పోయేలా నిర్వహించే ప్రక్రియ ల నడుస్తుందని,రెండు వైపులా డ్రైనేజీ నిర్మాణం పాత డ్రైనేజీ కంటే,లోపలకని కొత్త డ్రైనేజీ ఇన్నర్ వాల్ రావడం వల్ల ఏ ప్రాతిపదికన రోడ్డు ఎక్స్టెన్షన్ జరుగుతుందో అధికారులు వివరించాలని ప్రశ్నించారు.

అలాగే కొత్తగా వేస్తున్న డ్రైనేజీ ఇన్నర్ వాల్ బేస్ చాలా అధ్వాన్నంగా బేస్ నిర్మాణం జరుగుతుందని, పాత డ్రైనేజీ ఆనుకుని ఒక అడుగుమందం గతంలో పోసిన పోత మట్టిని తీసి పీసీసీ ని వేస్తున్నారని, అలాగే ఈ మొత్తం ప్రక్రియలో ఇసుక అనేది ఎక్కడా వాడలేదని అక్షేపించడం జరిగింది.  పనులు నత్తనడకన సాగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొనటం జరిగింది. వెంటనే సంబంధిత అధికారులు పనులను పర్యవేక్షించి రోడ్డు విస్తరణతో పాటు, నాణ్యతపై వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పనుల ను  పూర్తి చేయాలని, దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.