10 August, 2026 | 8:51 PM

Breaking News

బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసన   •   సంజయ్‌ని కలిసిన బిజెపి జిల్లా అధ్యక్షులు   •   ఆలేరు నూతన ఎస్‌హెచ్‌ఓ ఉదయ్ కిరణ్‌కు ఘన సన్మానం   •   రామప్ప సరస్సు నీటితో గణపసముద్రం నింపండి   •   మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త తల్లికి పద్మాదేవేందర్‌రెడ్డి నివాళి   •   ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ నాయకుడు ఆఫ్రిద్‌ను పరామర్శించిన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి   •   నిండు కుండగా మారిన ఎల్లయ్య చెరువు   •   తుంగతుర్తి పీఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులుగా పోతురాజు, బాణాల   •   దేశభక్తితో హర్ ఘర్ తిరంగా   •   కుంటుపడిన గూడెం అభివృద్ధిని గాడిలో పెట్టింది సిపిఐనే   •  

మొదట అనుమానించా

11-10-2024 12:00 AM

ప్రాధాన్యమున్న పాత్రల్నే ఎంచుకునే సాయిపల్లవి ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్‌తో ‘అమరన్’ చిత్రంలో జత కడుతోంది. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆమె దివంగత మాజీ సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెనా వర్గీస్ పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా పరిచయ కార్యక్రమంలో సాయిపల్లవి పలు విశేషాలను పంచుకుంది.

“నేనెప్పుడూ కథ వినను.. స్కిప్ట్ చదువుతా. ‘అమరన్’ స్క్రిప్టు బాగా నచ్చింది. నా సన్నివేశాలు కట్ చేస్తారేమోనని మొదట అనుమానించా. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలకు కంటెంట్ బాగా ఉంటుంది.. అలాంటప్పుడు కొన్ని సీన్లు తీసేస్తారు. ఇదే విషయాన్ని దర్శకుడితో మాట్లాడితే క్లారిటీ వచ్చింది.

ఈ సినిమా కోసం ఎన్ని త్యాగాలైనా చేయాల్సిందే అనిపించింది. మేజర్ సతీమణి ఇందుతో మాట్లాడి ఆమె మనసు అర్థం చేసుకునే ప్రయత్నం చేశా. ఒక మనిషి కోసం జీవితాన్ని త్యాగం చేయడం, జీవితంలో ఓ వ్యక్తిని ఇంతలా ప్రేమించగలరనే సంగతి ‘అమరన్’ కథ చదివాక తెలిసింది” అని చెప్పుకొచ్చింది సాయిపల్లవి.